‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆరోజే రాబోతున్నాడు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రాని వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తుంది. చైతూ సరసన అనూ ఇమ్యాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది.

ఇప్పటికే రిలీజ్‌ ఫస్టలుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజాగా ఈ సినిమా రీలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. నటిస్తుండగా గోపీసుందర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.