‘ శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్‌ లుక్‌ అదిరింది

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘ శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా, సీనియర్‌ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో శైలజా రెడ్డి (రమ్య కృష్ణ) కూర్చుని ఉండగా నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ పక్కన నుంచుని ఉన్నట్లుగా ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ శైలజా రెడ్డి అల్లుడు వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్‌ మారుతి ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాటను రీమేక్‌ చేయనున్నారు. ఈ పాటలో తమన్నా ఆడనున్నారు. ఈ చిత్రంనస పాటు చైతూ.. సవ్యసాచి, ఆ తర్వాత సమంత, చైతన్య కలిసి ఓ సినిమా చేయనున్నాట్లు సమాచారం.