శౌర్య ఎందుకు అలా అన్నాడో..?

‘కణం’ సినిమా షూటింగ్ సమయంలో హీరో నాగశౌర్యకు, సాయి పల్లవికి మధ్య గొడవలు వచ్చాయని.. ఆ కారణంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవిని కామెంట్స్ చేస్తూ శౌర్య కొన్ని వ్యాఖ్యలు చేశాడని అన్నారు. సెట్ లో సాయి పల్లవి ఆమె ప్రవర్తనతో బాగా ఇబ్బంది పెట్టిందని శౌర్య బహిరంగంగానే వెల్లడించారు. ఈ విషయంపై నోరు విప్పిన సాయి పల్లవి అసలు అక్కడ ఏం గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.
నాగ శౌర్య కామెంట్స్ విన్న వెంటనే ఆ సినిమా డైరక్టర్ విజయ్ కు కాల్ చేశానని.. ఆయన కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారని చెప్పింది సాయి పల్లవి. ఇక సినిమాటోగ్రాఫర్ నిరవ్ షాను కూడా అడిగితే తన దగ్గర ఇలాంటి సమాధానమే వచ్చిందని అన్నది. అయితే ఈ వివాదంపై మొదటిసారి నోరు విప్పిన సాయి పల్లవి ఏదైనా ఇబ్బంది జరిగితే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరక్టర్ కనుక అతనితో చెప్పాల్సిందని అన్నారు. చివరగా నాగ శౌర్య మంచి నటుడని ప్రశంస కూడా అందించింది. ప్రస్తుతం ‘కణం’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.