శ్రియా అలా ఎందుకు చేసింది..?

ప్రముఖ నటి శ్రియా సరన్‌ అభిమానులను నిరుత్సాహపర్చింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని గురువారం దర్శించుకున్నశ్రియ .. ఆలయం నుంచి తిరిగి వస్తూ మొహం కనిపించకుండా కప్పుకుని వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఇటీవల వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది శ్రియ. ఈ ఏడాది మార్చిలో శ్రియ, తన రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో అతి రహస్యంగా వివాహం చేసుకోన్నారు.

పెళ్లి చేసుకున్న అనంతరం తల్లితో కలిసి బుధవారం అర్ధరాత్రి తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వెలుపలికి వచ్చిన సమయంలో శ్రియను చూసేందుకు అభిమానులు పోటీపడగా మొహం చూపించకుండా వేగంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు.