శ్రీదేవిలో కొందరికి తెలియని విషయం!

దివంగత నటి శ్రీదేవి నటనలోనే కాదు పెయింటింగ్‌ వేయడంలోనూ తన ప్రతిభ చూపించారనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. అయితే తన భార్య వేసిన అద్భుతమైన ఈ పెయిటింగ్‌లతో ముంబై నగరంలో ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించాలను కుంటున్నారు ప్రముఖ నిర్మాత శ్రీదేవి భర్త బోనీకపూర్‌.

శ్రీదేవి పెయింటింగ్‌ను గతంలో 2010 లో లండన్‌ నగరంలోని ప్రతిష్ఠాత్మక క్రిస్టీలో నిర్వహించిన వేలంలో రూ.22 లక్షలకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. శ్రీదేవి వేసిన పలు పెయింటింగ్‌లను తన దగ్గరి స్నేహితులు, బంధువులకు శ్రీదేవి బహుమతిగా అందజేసింది. విశిష్ట పెయింటర్‌గా శ్రీదేవి వేసిన పెయింటింగులను సేకరించి ఆమె జ్ఞాపకార్థం ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించడానికి బోనీకపూర్‌ సన్నాహాలు చేస్తున్నారు.