శ్రీదేవి గురించి మాట్లాడి విమర్శలపాలవుతుంది!

శ్రీదేవి మరణంతో అటు ఇండస్ట్రీ ఇటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ గడిపేస్తున్నారు సెలబ్రెటీలు. ఇలాంటి సమయంలో రాణి ముఖర్జీ ఓ విషయాన్ని వెల్లడించి విమర్శలపాలైంది. ఆమె మాట్లాడిన తీరుపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. నిజానికి శ్రీదేవి, రాణి ముఖర్జీ మంచి మిత్రులు. అయితే శ్రీదేవి దుబాయ్‌లో మ్యారేజ్‌కి వెళ్లడానికి ముందు రాణిని కలిశారట.
దుబాయ్ వెళ్లడానికి ముందు ‘హిచ్‌కి’ చూడాలనుందని శ్రీదేవి.. రాణిముఖర్జీను అడిగిందట. ముందు దుబాయ్‌కి వెళ్లి మ్యారేజ‌్‌కి అటెండ్ అవమని, నువ్వు తిరిగి రాగానే నేను ఆ సినిమా నీకు చూపిస్తాననిచెప్పిందట రాణి. ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదని  రాణి ముఖర్జీ వెల్లడించింది. ఈ సినిమా మార్చి 23న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సమయం, సందర్భం లేకుండా తన సినిమా ప్రమోషన్ కోసం ఆమె శ్రీదేవి మరణాన్ని వాడుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉద్దేశం మంచిదే అయినా చెప్పే సందర్భం కూడా చూసుకోవాలని ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తోంది.