‘శ్రీనివాస కల్యాణం’ టీజర్‌

నితిన్ హీరోగా‌, రాశీ ఖన్నా, నందితా శ్వేతాలు హీరోయన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 14 సంవత్సరాల క్రితం నితిన్‌, దిల్‌రాజుల కలయికలో వచ్చిన దిల్‌ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్లి ఆ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ సంక్రాంతికి విడుదలైన శతమానం భవతి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టడంతో పాటు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు అందుకుంది. దానికి దర్శకత్వం వహించిన వేగేశ్న సతీష్‌ ఈ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఈ టీజర్‌ నితిన్, రాశీలపై ఈ టీజర్ ను కట్ చేశారు.. ఈ ఇద్దరు కెమిస్ట్రీ అదిరింది.ఈ టీజర్‌ ఓ సాంగ్‌తో ప్రారంభం అవుతోంది.నితిన్.. హీరోయిన్ రాశిఖన్నాతో ”మీ టైమ్ రెండు గంటలు అప్పు ఇస్తారా..” అని అడగడం, అలాగే హీరోయిన్.. ” ఏ.. అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా.. మాకు రారా” అంటూ నితిన్‌కి ఓ ఘాటు ముద్దు ఇవ్వడం వంటివి పొందుపరిచారు. కాగా ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.