శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ

movie-poster
Release Date
August 9, 2018

దిల్‌రాజు నిర్మాణంలో గతేడాది శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వెగేశ్న దిల్‌రాజు నిర్మాతగా మరో కుటుంబ కథా నేపథ్యంలో “శ్రీనివాస కల్యాణం” మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో తెలుగింటి సంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అంటే బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ఓ అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం. మరి ఈ కల్యాణం ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.

కథ
మన హీరో నితిన్ (శ్రీనివాసరాజు) ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆ కుటుంబంలో విలువలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు పెద్దపీట. వ్యాపారమే పరమావధిగా భావించే ఆర్కే (ప్రకాష్ రాజ్) కూతురు శ్రీదేవి(రాశిఖన్నా)తో శ్రీనివాస్ ప్రేమలో పడతాడు. తన ఫ్యామిలీని, సంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చి శ్రీనివాస్‌ను ఇష్టపడుతుంది శ్రీదేవి. చిన్నప్పటి నుంచి తెలుగు సంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు విని పెరిగిన శ్రీనివాస్‌ తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆర్కే మాత్రం ప్రతి విషయాన్ని వ్యాపారపరంగా ఆలోచించే వ్యక్తి. అయితే వీరిద్దరి పెళ్లి జరిగేందుకు ఆయన ఎలాంటి షరతులు పెట్టాడు. తన కూతురు ప్రేమకు విలువిచ్చాడా? సంప్రదాయం గల కుటుంబంలోకి తన కూతురుని పంపించాడా.. చివరికి పెళ్లి ఎలా జరిగిందనేదే కథ.

నటీనటులు
సంప్రదాయలు, కుటుంబ బంధాలు విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్‌ ప్రధానమైన పాత్రలో కనిపించాడు. దాంతో అతనిలో ఉన్న సహజసిద్ధమైన ఎనర్జీ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. ఈ కథలో ఎక్కడా నితిన్‌ను ఒక హీరోగా చూడలేం. కేవలం ఒక పాత్రగా పరిగణిస్తాం. ఇక శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా చక్కగా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. నందిత శ్వేతకు పద్మావతి వంటి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. బిజీ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్‌ రాజ్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ ఇలా అంతా సాధారణ పాత్రల్లో కనిపించారు.

విశ్లేషణ
మనకు టైటిల్, పోస్టర్‌లో చూస్తేనే పెళ్లి నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీగా ప్రేక్షకుడు భావిస్తాడు. అయితే కేవలం పెళ్లి మాత్రమే కాదు.. పెళ్లిలో ఉండే ఆచారాలు, కట్టుబాట్లు, పెళ్లి తంతు వాటి గురించి ఓ కథ చెప్పబోతున్నామంటూ చిత్ర యూనిట్ ముందుగానే చెప్పారు. దానికి తగ్గట్టుగానే సినిమాను రూపొందించారు. శతమానం భవతి సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ను కూడా ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న దిల్‌ రాజు బ్యానర్‌లో కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో సతీష్ విఫలం అయ్యాడు. పెళ్లి నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా సెకండ్‌ హాఫ్‌లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్‌ మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా పెళ్లి గొప్పతనాన్ని చెప్పడానికి సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రచయితగా సతీష్ ఆకట్టుకున్నారు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్‌’ లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్‌ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పెళ్లి పాట తప్ప మరే పాట మెప్పించేలాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి పెళ్లి వేడుకకు మరింత అందం తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్
పెళ్లి కాన్సెప్ట్‌
కొన్ని సన్నివేశాలు

డ్రాబ్యాక్స్
పాటలు
సెకండ్‌ హాఫ్‌లో కథ నెమ్మదించడం

చివరిగా : పెళ్లి కథా చిత్రం
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

సినిమా : శ్రీనివాస కల్యాణం
నటీనటులు : నితిన్‌, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌ తదితరులు
రచన, దర్శకత్వం : సతీష్ వెగేశ్న
నిర్మాతలు: దిల్‌రాజు‌, శిరీష్‌
సంగీతం : మిక్కీ జే మేయర్

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పెళ్లి కథా చిత్రం
Rating: 2.75/5

www.klapboardpost.com

శ్రీనివాస కళ్యాణం.. కుటుంబ ప్రేక్షకులకు మాత్రమే
Rating: 2.5/5

www.tupaki.com

శ్రీనివాస కళ్యాణం – సంప్రదాయాలతో బంధాల మేళవింపు
Rating: 3/5

www.123telugu.com