‘శ్రీనివాస కల్యాణం’ మేకింగ్‌ వీడియో

నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటించస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. ఈ చిత్రంలో నందితా శ్వేత మరో కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా.. వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ కూడా చాలా అందంగా ఉన్నాయి. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇంట్లో జరుగుతున్న పెళ్లికి పెద్దలు, పిల్లలు చేసే సందడంతా ఈ మేకింగ్‌ వీడియోలో చూపించారు. సినిమాలా కాకుండా నిజంగానే పెళ్లి జరిపిస్తున్నట్లుగా చాలా అందంగా తెరకెక్కించారు.

ఈ సినిమా చిత్రీకరణలో దాదాపు 60 మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నట్లు వీడియోలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలోని పేరున్న సెలబ్రిటీలందరూ ఈ సినిమాలోనే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్, గిరిబాబు, ఆమని, జయసుధ, నరేశ్‌, సితార తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.