శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశమిస్తానన్న నిర్మాత..?

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్ వివాదాన్ని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. ఆ తర్వాత తమిళంలోనూ పలువురు నటులు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. దీంతో నటి శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీ పెద్దలు శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. ఒక వేళ ఆమెకు అవకాశం ఇచ్చినా, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే భయంతో ఆమెను దూరంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ బడా నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చారు. అవకాశం ఇస్తామని అక్కున చేర్చుకున్నారు. ఆ నిర్మాత ఎవరు అంటే?

అందాల నటి శ్రీదేవి బాల్య స్నేహితురాలు, ప్రముఖ నటి కుట్టి పద్మిని. బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన కుట్టి పద్మిని.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 25 సినిమాలకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సీరియల్‌, వెబ్‌ సిరీస్‌ల నిర్మాతగా బిజీగా ఉన్నారు. ‘లేత మనసులు’ సినిమాలో ఆమె బాలనటిగా ద్విపాత్రాభినయం చేశారు. తర్వాత పలు చిత్రాల్లో సహ నటిగా ఆకట్టుకున్నారు. తెలుగులో ప్రజాదరణ పొందిన ‘కిట్టుగాడు’ సీరియల్‌లో ఆమె ప్రధాన పాత్ర
పోషించారు. 1996లో విడుదలైన ‘పవిత్ర బంధం’ సినిమా తర్వాత ఆమె తమిళ ఇండస్ర్టీలో బిజీ కావడంతో మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.

1983నుంచి కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వేధింపులు మొదలయ్యాయని చాలా మంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇందులో చిక్కుకునేవారే అని పద్మిని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకరిద్దరు మోసం చేసినప్పుడే శ్రీరెడ్డి అప్రమత్తమై మిగతా వారికి అలాంటి అవకాశం ఇచ్చి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను నిర్మిస్తున్న సీరియళ్లు, వెబ్‌ సీరీస్‌లలో శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఇందుకు శ్రీరెడ్డి కూడా ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు ధన్యవాదాలు తెలిపింది.