శ్రీ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు

కాస్టింగ్ కౌచ్ వివాదం తో తెరపైకి తెచ్చిన నటి శ్రీ రెడ్డి. సోషల్‌ మీడియా ద్వారా పలువురు టాలీవుడ్‌ ప్రముఖల మీద సంచలన వ్యాఖ్యలను చేసింది. అయితే ప్రస్తుతం తమిళ ఇండస్ర్టీ లో ప్రముఖలపై ఆరోపణాలకు దిగింది. ఇప్పుడు ఈ భామకు తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి షాక్‌ ఇవ్వడం సంచలనంగా మారింది.అయితే తాజాగా శ్రీరెడ్డి పై చెన్నై పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీ రెడ్డి తనంతట తాను వ్యభిచారం చేసానని, అవకాశాల కోసం హీరోలతో అలాగే దర్శక నిర్మాతలతో పడుకున్నానని స్వయంగా చెబుతోంది కాబట్టి ఆమె పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ మక్కల్‌ మంద్రం అనే సంస్థ సభ్యుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పలువురు సినీ ప్రముఖులు నన్ను వాడుకున్నారని సోషల్‌ మీడియా, వీడియో ల రూపంలో ఆరోపణలు చేసింది. కాబట్టి ఆమె వ్యాఖ్యలనే ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసుకోవాలని కోరుతున్నాడు. ఇండియన్‌ మక్కల్‌ మంద్రం సభ్యుడు. ఇన్నాళ్లు అందరినీ ఓ ఆట ఆడుకున్న శ్రీ రెడ్డి రెడ్డికి ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే. ఇక చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి శ్రీ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారా? లేక ఫిర్యాదుని తిరస్కరిస్తారా అనేది చూడాలి