షాహిద్ కపూర్ వ్యాక్స్ స్టాట్యూ!

ఇలీవలే లండన్‌, దుబాయ్‌లో ప్రభాస్ (బాహుబలి) మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అదే తీరుగా పద్మావతి ఫేం దీపిక పదుకొనే మైనపు విగ్రహాన్ని లడన్‌లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ఈలోగానే మరో సమాచారం అందింది. మ్యాడమ్ తుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాల (వ్యాక్స్ స్టాట్యూ) ఏర్పాటు గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంటుంది.

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ కోసం ఉత్తరాది రఫ్ & టఫ్ గయ్‌ షాహిద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఇదివరకూ ప్రచారమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ `అర్జున్‌రెడ్డి` రీమేక్‌లో బిజీగా ఉన్న షాహిద్ కపూర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తాజాగా మ్యాడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు కొలతలు తీసుకున్నారు. ఆ విషయాన్ని షాహిద్ స్వయంగా వెల్లడించారు. తన కనుగుడ్డు పరిమాణం కొలతలు తీసుకున్న ఫోటోని షాహిద్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో జోరుగా వైరల్ అవుతోంది.