సన్నీలియోన్ బయోపిక్‌ టీజర్‌

‘పోర్న్‌స్టార్’ గా కెరీర్‌ను ప్రారంభించిన సన్నీలియోన్ తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొందో మనకు తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌ సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా చేసిన హిందీ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ షో తర్వాత బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం మొదలైంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ.. ఇండస్ర్టీలో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సన్నీ. ఈ గుర్తింపుతోనే పోర్న్‌స్టార్‌ ఇమేజ్‌ నుంచి బయటపడగలిగారు. అయితే ఇప్పుడు సన్నీ లియోనీ జీవితం ఆధారంగా కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ పేరిట ఓ బయోపిక్‌ రాబోతోంది.

అయితే ఈ బయోపిక్‌ సినిమాలా కాకుండా వెబ్‌సీరీస్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్‌సీరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌లో సన్నీ చిన్నప్పటి అనుభవాలను చూపించారు. సన్నీకి మేకప్ చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. జీవితంలో సన్నీ ఎదుర్కొన్న పరిస్థితులు చూపించారు. మోడలింగ్‌ ఇండస్ట్రీలోకి వెళ్లడం.. ఫొటో షూట్స్ చేయడం చూపారు. ఆ తర్వాత ఆమె పనుల నచ్చక సన్నీని ఆమె తల్లిదండ్రులు కోప్పడటం వంటివి చూపించారు. చిన్నప్పటి సన్నీలియోనీ పాత్రను రైసా సౌజానీ అనే బాలిక చేస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 16న ఓ ఇంగ్లీష్ చానెల్లో ప్రసారం కానుంది.