సన్నీ పట్ల రాఖీ పశ్చాత్తాపం

బాలీవుడ్‌లో ఐటెమ్‌ సాంగ్‌లకు, శృంగార ప్రధాన చిత్రాలకు రాఖీ సావంత్‌ ఒకప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది . అయితే సన్నీలియోన్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడంతో రాఖికి అవకాశాలు దూరమైపోయాయి. దీంతో సన్నీపై రాఖీ అకారణంగా కోపం పెంచుకుని రకరకాలుగా విమర్శించేది. సన్నీలియోన్‌ వంటి ఫోర్న్‌స్టార్‌ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ చెడిపోతోందని, ఆమెను తక్షణమే బాలీవుడ్‌ నుంచి బహిష్కరించాలని వీలు దొరికినప్పుడల్లా రాఖీ డిమాండ్‌ చేసేది.

సన్నీలియోన్ గురించి తన వ్యాఖ్యల పట్ల ఓ టీవీ కార్యక్రమంలో రాఖీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ‘సన్నీలియోన్‌ గురించి చాలా తప్పుగా మాట్లాడా. అసలు ఆమె గురించి నాకేం తెలుసని అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది పూర్తిగా నా పొరబాటే. ఆమె వ్యక్తిగత జీవితం, గత చరిత్ర నాకు పూర్తిగా అనవసరమైన విషయాలు. భారత దేశానికి చెందిన పాపను దత్తత తీసుకుని, పలు సామాజి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సన్నీ మనస్తత్వం చాలా గొప్పది. గతంలో ఆమె గురించి అలా మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నాన’ని రాఖీ చెప్పింది.