సమంత సీమరాజా చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ నటి సమంత ప్రస్తుతం యూ టర్న్‌, సీమరాజా, సూపర్ డీలక్స్ ల్లో నటిస్తుంది. ఇందులో ఒక సినిమా విడుదలకు సిద్దమైంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన సీమరాజా సినిమాలో సమంత, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చేయనున్నారు.

రంగస్థలం సినిమాలో పల్లెటూరి ఆడపిల్లలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత ఈ చిత్రంలో కూడా అచ్ఛమైన పల్లెటూరి అమ్మాయిగా అలరించనుంది. ఈ చిత్రాని వినయకచవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13వ తేదినా విడుదల చేయనున్నాట్లు చిత్రబృందం ప్రకటించింది. సామ్‌ మరో చిత్రం సూపర్‌ డీలక్స్‌ అక్టోబర్‌లో విడుదల కానుంది.