సల్మాన్ సినిమాలో అతిలోక సుందరి?

సల్మాన్ సినిమాలో అతిలోక సుందరి?
అతిలోక సుందరి శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ వింగ్లీష్
సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలానే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘పులి’ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది. ప్రస్తుతం మామ్ కినేమఓ నటిస్తోన్న శ్రీదేవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించనుందని టాక్. రచయిత విపుల్ షా చెప్పిన కథ నచ్చడంతో సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తల్లీ కొడుకుల బంధం నేపధ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో ఓ ముఖ్య పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఏంటనేది..? దానికి శ్రీదేవి అంగీకరించిందో లేదో.. అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం సల్మాన్, కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘ట్యూబ్ లైట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మందబుద్ది గల సైనికుడి పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
CLICK HERE!! For the aha Latest Updates