సాయిపల్లవి డెడికేషన్ కు ‘ఫిదా’!

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. యూత్ లో ఈ బ్యూటీ క్రేజ్ మాములుగా లేదు. దీంతో హీరోలంతా తమ సినిమాలలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో అమ్మడు యాటిట్యూడ్ పై కొన్ని రూమర్లు వినిపించాయి. తన ప్రవర్తనతో హీరోలను, నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని సెట్స్ కి సమయానికి రావడంలేదని చాలా పొగరుగా ప్రవర్తిస్తోందని అన్నారు. కానీ అది అసలు ఆమె వ్యవహారశైలి కాదని లేటెస్ట్ టాక్.
శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం కలకత్తాకు వెళ్ళింది. అయితే సాయిపల్లవి ఉదయాన్నే 5 గంటలకు కాళీమాతను దర్శించుకొని గంట ముందే సినిమా సెట్స్ కు వెళ్ళిందట. ఇంతటి అంకితభావం, ప్రొఫెషనలిజం చిత్రనిర్మాతలను ఆశ్చర్యపరిచిందట.