సాయి ధరమ్‌ తేజ్‌ రితికాతో..

రితికా సింగ్‌ గురు చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన నటి. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్న ఈ హీరోయిన్‌ తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ సరసన నటించే చాన్స్‌ దక్కించుకుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తేజ్‌ చేయనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

1

అయితే ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తేజ్ ఐ లవ్‌ యూ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. రొమాంటిక్‌ లవ్‌ సోర్టీగా రాబోతున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. ఇటీవల ఆడియో వేడుక కూడా నిర్వహించారు. ఈ చిత్రం జులై 6వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు.