సావిత్రమ్మకు మొండితనం ఎక్కువ

తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి రమాప్రభ తాజా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను, కష్టాలను పంచుకున్నారు. మహానటి సావిత్రితో తనకు మంచి బంధం ఉందని, ఆమెతో చాలా రోజులు ఉన్నానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. సావిత్రికి మొండితనం ఎక్కువని రమా అన్నారు.

సావిత్తమ్మతో నాకు చాలా దగ్గర బంధం ఉంది. ఆమె 1981లో చనిపోయారు. 11 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. జెమిని గణేశన్‌ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆమె చేయి పట్టుకుని కూర్చనే వారు, నేను చూశాను. ఆయన తప్పు ఒక శాతం కూడా లేదు. తప్పంతా సావిత్రమ్మదే..అంటే చెడ్డగా కాదు. ఆమో బాగా మొండి. ఎంత ధర్మగుణం, ఎంత స్నేహగుణం ఉందో..అంతే సమానంగా ధైర్యం, మొండితనం ఉన్నాయి. దాని వల్ల ‘నేను ఇంతే’ అనుకునేవారు . అది ఆమెకు చెడు అయ్యింది. మహానటి చిత్రం ఇంకా చూడలేదు. చూడమని చాలా మంది అడుగుతున్నారు.

‘సావిత్రమ్మను ప్రేమించే వాళ్లు కుటుంబంలో చాలా మంది ఉన్నారు. ఆమె చేసే మంచి పనులకు జెమిని గణేశన్‌ ఎప్పుడు అడ్డురాలేదు. ఆయన వల్లే ఆమె జీవితం అంత అందంగా తయారైంది. ఆయన ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. ఆమెకు కూడా ఆయనపై చాలా ప్రేమ ఉండేది. సావిత్రమ్మకు మద్యం తాగడం ఎవరూ నేర్పలేదు. ఆమెకు ఎవరూ శత్రువులు లేరు. పిల్లలంతా బావుండేవారు’ అని రమాప్రభ తెలిపారు