సింగర్‌ సునీతకు పెళ్లి?

తెలుగు ఇండస్ర్టీలో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత. అయితే ఆమె వృత్తిపరంగా ఎంతో విజయం సాధించినా వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.సునీత త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ.. వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్‌ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి.

చిన్నతనంలోనే ఇండస్ర్టీకి వచ్చిన ‘సునీత’ సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కి పైగా సినిమాల్లో పని చేశారు.19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల చాలా ఏళ్ల క్రితమే తన భర్తతో విడిపోయారు. కాగా మరో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్య్వూల్లో ఆమె స్పందిస్తూ… అలాంటి ఆలోచన లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్దమయ్యారంటూ కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో ఆమె స్పందన ద్వారా తెలియాలి.