సితార పుట్టినరోజు సంబరాలు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు , నమ్రతల గారాలపట్టి సితార నేడు పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఆరు ఏళ్లు నిండి ఏడో ఏట అడుగుపెట్టింది సితార.ఈ వేడుకను ఓ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా బర్త్‌ డే వేడుకను సెటబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుటుంబీకులంతా సితారకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్బంగా మహేశ్‌, నమ్రతతో పాటు సుధీర్‌బాబు కూడీ తన మేనకొడలికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

నాకు అన్నీ తానే అయి సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని ఆశిస్తున్నాను. ఐ లవ్యూ సితా పాపా..అన్నారు మహేశ్ బాబు. నీతో నాకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం. నువ్వు నన్నెంతో సంతోషపెడతావు. ఐలవ్యూ సోమచ్‌. నీకెంతో ప్రత్యేకమైన ఈ రోజు నువ్వు కోరుకున్న సంతోషం, ప్రేమ అన్నీ దక్కాలని కోరుకుంటున్నాను అన్నారు నమ్రత. ‘సితార’ లు దిగివచ్చిన వేళ. పిల్లల కామిక్స్‌లో కన్పించే నిజమైన స్టార్‌ సితారే. మా ఇంట్లోని బ్రైటెస్ట్‌ స్టార్‌ అయిన సితారకు హ్యాపీ బర్త్‌డే అని సుధీర్‌ బాబు సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.