సిద్ధార్థ్‌ పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

దక్షిణాది హీరో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్‌ పుట్టిన రోజుకు సంబంధించి సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. తమిళ సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా, ప్రభాస్‌ పుట్టిన రోజుకు మరో వంద రోజులు సమయముందంటూ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ నెక్ట్స్ పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ కామెంట్‌ చేశాడు. అయితే సిద్ధార్థ్‌ చేసిన కామెంట్ వెటకారంగా ఉందంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. కొంత మంది గంతలో ప్రభాస్‌, సిద్ధు కలిసి దిగిన ఫోటోను సిద్ధార్థ్‌కు ట్యాగ్ చేస్తూ ‘ఎందుకు భయ్యా నీ ఫ్రెండే కదా..’అంటే మరి కొందరు ‘టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ జోలికి వస్తే చుక్కలు చూపించాల్సి వస్తుంది’ అంటూ కామెంట్‌ చేశారు

ఈ కామెంట్స్‌ పై సిద్ధార్థ్‌ స్పందిస్తూ.. ‘అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే ఫ్రీడం తీసుకున్నా. డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కద భయ్యా?’ అంటూ రిప్లై ఇస్తూ.. తనని తాను సమర్ధించుకున్నాడు సిద్దార్థ్‌. మరి ఈయన ఇచ్చిన సమాధానంతో అభిమానులు శాంతిస్తారేమో చూడాలి.