‘సిల్లీ ఫెలోస్’ వీళ్ళే!

అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అల్లరి నరేశ్.. సునీల్ హీరోలుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో ‘తొట్టి గ్యాంగ్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్. ఇప్పుడు వీళ్లిద్దరూ హీరోలుగా ఒకే సినిమాలో చేస్తున్నారు. నరేష్‌ – భీమినేని కలయికలో వచ్చిన ‘సుడిగాడు’ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తమిజ్‌ పాదం’కి రీమేక్‌ అది.

అక్కడ ‘తమిజ్‌ పాదం 2’ కూడా విడుదలైంది. దాన్నే ‘సిల్లీ ఫెలోస్‌’ పేరుతో తెలుగులో తీస్తున్నారని సమాచారం. నరేష్‌ – భీమినేని కలయికలో వచ్చిన ‘సుడిగాడు’ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తమిజ్‌ పాదం’కి రీమేక్‌ అది. అక్కడ ‘తమిజ్‌ పాదం 2’ కూడా విడుదలైంది. దాన్నే ‘సిల్లీ ఫెలోస్‌’ పేరుతో తెలుగులో తీస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ తో పాటు సునీల్ పాత్రకి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఒక రకంగా ఇద్దరూ హీరోలే అన్నట్టుగా ఉంటుందన్న మాట. త్వరలోనే ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.