సీనియర్‌ నటి అన్నపూర్ణ కూమారై బలవన్మరణం

టాలీవుడ్‌ సీనియర్‌ నటి అన్నపూర్ణ ఇంటో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమారై కీర్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బంజారాహిల్స్‌లోని వారి నివాసం నందు నిన్న రాత్ని ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున కీర్తి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగకొట్టే చూసే సరికి ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నటి అన్నపూర్ణ దంపతులకు పిల్లలు లేదు. కొన్నేళ్ల క్రితం కీర్తిని దత్తత తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఆమె పెళ్లి చేశారు. కాగా కూతురికి మాటలు రాకపోవడంతో ఒత్తిడికి లోనైన కీర్తి డిప్రెషన్‌కు గురయ్యారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని తెలుస్తోంది. అనారోగ్య సమస్యలే కీర్తి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.