సీనియర్ హీరోయిన్ పెళ్ళికి రెడీ!

దక్షిణాదిలో దాదాపు 18 సంవత్సరాల పాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ కొంత గ్యాప్ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ‘గాయత్రి’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రీయ పెళ్లికి సిద్ధమైందని బి టౌన్‌లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఓ రష్యన్ యువకుడితో ఈమె ప్రేమాయణం సాగిస్తుంది అన్నారు. అవన్నీ ఒట్టి రూమర్స్ అని ఆమె కొట్టిపారేసింది. అయితే శ్రీయ వివాహం సదరు రష్యన్ యువకుడితోనే జరుగుతుందని, ప్రస్తుతం శ్రీయ తల్లిదండ్రులు పెళ్లి సన్నాహాల్లో ఉన్నారని టాక్.
మార్చి 17, 18, 19వ తేదీల్లో ఈమె మూడు రోజుల చేసుకుంటుంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. హొలీ థీమ్ తో హిందూ సంప్రదాయాల ప్రకారం ఇద్దరూ ఒకటవ్వబోతున్నారు అని శ్రీయ ఇప్పటికే కాబోయే అత్త మామలని రష్యా వెళ్లి కలిసి వచ్చిందంటూ ముంబై మిర్రర్ రాసుకొచ్చింది.