సీన్ లోకి ఇళయరాజా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకు ముందుగా సంగీతం దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ ఆయన కొన్ని కారణాల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడని, కాదు కాదు కీరవాణిని ఫైనల్ చేశారని రకరకాల వార్తలు వినిపించాయి.
తాజాగా ఇప్పుడు సీన్ లోకి ఇళయరాజా ఎంటర్ అయ్యారు. ‘సై రా’కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇళయరాజా.. చిరంజీవిని కలవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అంటున్నారు. గతంలో చిరు నటించిన కొన్ని చిత్రాలకు ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.