‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్‌

అక్కినేని సుమంత్‌ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్‌ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్‌ మరో సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సుమంత్‌ తన సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. టైటిల్‌ను సర్పం, నెమలితో డిజైన్‌ చేశారు. దినిలో ఉన్న అంశాలను బట్టి చూస్తే సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది

ఈ సినిమాలో ఈషా రెబ్బ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రంతో సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్‌ సినీకార్ప్‌ పతాకంపై ధీరజ్‌ బొగ్గారం, బీరం సుధాకర్‌ రెడ్డి ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్‌ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతమందిస్తున్నారు.