సూర్య‌ సరసన సయేశా

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌స్తుతం సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం లో NGK సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇంకో రెండు
నెల‌ల్లో ఈ సినిమా పూర్తి కానుండడంతో త‌న త‌దుప‌రి సినిమా ప‌నులు సూర్య మొద‌లు పెట్టాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కేవీ
ఆనంద్ తో ఈ కొత్త సినిమా ఉండ‌నుందన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న స‌యాశా న‌టించ‌నుంద‌ని
సమాచారం. ఈ ముద్దుగుమ్మ అఖిల్ న‌టించిన‌ సినిమా హాలోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయమే.

ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు రానుంది. మ‌ల్టీస్టారర్ తర‌హాలో తెర‌కెక్కనున్న
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పొషించనున్నారు. మ‌న తెలుగు హీరో అల్లు శిరీష్ కూడా ఈ ప్రాజెక్టులో
క‌నిపించనున్నాడు. గ‌తంలో కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు మంచి విజయాల‌ను సాధించాయి. సూర్య చేసిన
వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాలు బాగుండడంతో కొత్త ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఇక సూర్య ప్ర‌స్తుతం చేస్తున్న
NGK సినిమా దీపావ‌ళి నాటికి విడుద‌ల కానుంది.