సూర్య రైతుల కోసం ఏం చేశారంటే..!

కోలీవుడ్ స్టార్‌హీరో సూర్య నిర్మాతగా ఇటీవల తన తమ్ముడు కార్తీ హీరోగా ‘చినబాబు’ చిత్నాన్ని రూపొందించారు. ఈ సినిమాను రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కించిన సూర్య.. రైతులకు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు రూ. 12 లక్షలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ అభివృద్ది సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాధించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. ఈ చిత్రంలో కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్‌లో మాత్రం భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రైతుల సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అనుబంధాలతో మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. కాగా ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్వకత్వం వహించారు.