సెప్టెంబరు 6న ‘నోటా’ ట్రైలర్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘నోటా’. ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ రాజా సమర్పిస్తున్న ఈ మూవీలో మెహరీన్‌ హీరోయిన్‌.

కాగా ఈ రోజు సోమవారం తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ‘సినిమా ట్రైలర్‌ను సెప్టెంబరు 6న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. నాకు రాజకీయాలంటే అసహ్యం. కానీ నేను చేయాల్సి వస్తే.. ఇలా రాజకీయాలు చేస్తా. ‘నోటా’. 48 గంటల్లో అతి ముఖ్యమైనది, 72 గంటల్లో ట్రైలర్‌ విడుదల కాబోతున్నాయి’ అని ఆయన‌ ట్వీట్‌ చేశారు.

‘నోటా’ కొత్త పోస్టర్‌లో దేవరకొండతో పాటు సత్యరాజ్‌, నాజర్‌ ఉన్నారు. వారి చుట్టూ జెండా పట్టుకుని ఉన్న ప్రజలు కనిపించారు. ఓట్లు, ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.