‘సెలెక్ట్’ మొబైల్స్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

వివిధ ప్రొడక్ట్‌లకు మన హీరోలు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌ ఓ మొబైల్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే కొన్ని ఉత్పత్తులకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, జండూ బామ్ వంటి వాటికి ప్రచారకర్తగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2018లోనూ ఎన్టీఆర్ తన సేవలను అందించాడు.

ఇప్పుడు తాజాగా ‘సెలెక్ట్’ మొబైల్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎన్టీఆర్ ఉండబోతున్నారు. దీనికి సంబంధించి సెలెక్ట్ మొబైల్ సంస్థకు, ఎన్టీఆర్ కు మధ్య అగ్రిమెంట్ కూడా పూర్తయింది. సెలెక్ట్ మొబైల్స్ కు ప్రచారం నిర్వహించినందుకు ఎన్టీఆర్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత.. వీరరాఘవ’ సినిమా చేస్తున్నాడు. దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక, ఎస్‌. రాధాకృష్ణ నిర్మాత.