సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు మిస్టరీ షాక్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ సైకోకిల్లర్ శ్రీనివాస్ రెడ్డి జీవితంలో ప్రేమకథ  ఆసక్తి రేపుతోంది. అంత క్రూరుడిగా మారి ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు తన ప్రియురాలును కలుసుకునేందుకు  కరీంనగర్ పూర్వపు జిల్లా వేములవాడకు తరచూ వెళ్లేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇక్కడే అనుకోని ట్విస్ట్ నెలకొంది. 
 
తాజాగా వేములవాడ సమీపంలోని అగ్రహారం గుట్టల్లో 15రోజుల కింద గుర్తుతెలియని యువతి మృతదేహం లభించింది. కుళ్లిన స్థితిలో ఉన్న ఈమె మృతదేహం ఎవరిది అనేది పోలీసులు ఇంతవరకూ కనిపెట్టలేదు. దీంతో సదురు యువతి శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతేనా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నట్టు సమాచారం. 
 
అయితే తనను పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి అంగీకరించినందున తాను సదురు యువతిని హతమార్చలేదని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. కానీ అతడి ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆ ప్రియురాలు జాడ మాత్రం వేములవాడలో కనిపించడం లేదు. 
 
శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలి వివరాలు లభించి.. సదురు యువతి క్షేమంగా ఉన్నట్టు తేలడంతోపాటు అగ్రహారం గుట్టల్లో హత్యకు గురైన యువతి వివరాలు తెలిస్తే తప్ప ఇది శ్రీనివాస్ రెడ్డి పనా? లేక వేరే ఎవరిదైనా అనే విషయం తెలిసే చాన్స్ ఉంది. 
CLICK HERE!! For the aha Latest Updates