‘సైమా’ సందడి మొదలైంది

దుబాయ్‌లో జరగనున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఏడో ఎడిషన్‌లో పాల్గొనేందుకు తారాలోకం కదులుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర విభాగాలకు చెందిన వారు ఒక్కొక్కరూ దుబాయ్‌ చేరుకుంటున్నారు. బాలకృష్ణ, కీర్తి సురేశ్‌, అంజలి, సాయికుమార్‌, సుశాంత్‌, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌లు ఇప్పటికే సైమా వేదిక వద్దకు చేరుకున్నారని.. కొంతమంది తమ జీవిత భాగస్వాములతో హాజరవుతున్నారని సైమా అధికారికంగా ట్వీట్‌ చేసింది. వారి చిత్రాలను పోస్ట్‌ చేసింది.

మాధవన్‌, విక్రమ్‌, హీరోయిన్‌ ప్రణీత, ఏక్తారాథోడ్‌, నటుడు రాహుల్‌, ప్రియదర్శి, తమిళ దర్శకుడు అట్లీ, సింగర్స్‌ చిత్ర, పి.సుశీల ఇప్పటికే సైమా వేదిక వద్దకు చేరుకున్నారు.టాలీవుడ్‌ నుంచి సైమాకు.. బాహుబలి ది కన్‌క్లూజన్‌, ఘాజీ, గౌతమీపుత్ర శాతకర్ణి, ఫిదా, శతమానంభవతి ఉత్తమ చిత్రాలు గా ఎంపికైయ్యాయి.