‘సైరా’లో విజయ్‌ సేతుపతి అదేనట!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నసైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 35 రోజులు షెడ్యూల్‌ పూర్తైంది. బ్రిటిషు సైనికులతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నిపుణుడు గ్రాగ్‌ పావెల్‌ పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో పలు ముఖ్యమైన పాత్రల్లో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు నటిస్తున్నారు. కాగా చిత్రాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

కాగా ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పాత్రలో కనిపిస్తానని తాజాగా మీడియాతో వెల్లడించారు. ‘సైరాలో నేను తమిళం మాట్లాడే వ్యక్తి పాత్రలో కనిపిస్తా. అలాగని స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడను. తమిళనాడు నుంచి ఆంధ్రాకు వచ్చే వ్యక్తిగా నటిస్తున్నా. కాబట్టి నటించడం పెద్ద కష్టం కాదు’ అని ఆయన అన్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రచార చిత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం.