సైరా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సైరా నరసింహారెడ్డి”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌, నయనతార, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను రప్పించారు. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రాలకు పనిచేసిన గ్రెగ్ పావెల్ ఈ చిత్రంలో స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నారు.

గతంలో సల్మాన్‌ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్‌పాయో చిత్రానికి గ్రెగ్ పావెల్ పనిచేశారు. భారత్‌లో రెండో సినిమా సైరా చిత్రానికి చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరువుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై హీరో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గ్రెగ్‌ పావెల్‌తో కలిసి సుదీప్‌ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ”ఈయన గ్రెగ్‌ పావెల్‌. అద్భుతమైన హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన లండన్‌కు చెందిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌. ‘సైరా’ సినిమాలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని సుదీప్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates