సైరా జాబితాలో చేరిన హుమా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే పలువురు నటీ,నటులు అమితాబ్‌ బచ్చాన్‌, జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌, నయనతార, తమన్నా, సుదీప్‌..ఇలా పేరున్న స్టార్స్‌ కనిపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌కు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్స్‌లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

 

తాజాగా ఈ సినిమా తారల జాబితాలో మరో బాలీవుడ్ నటి వచ్చి చేరారు. ఇటీవల కాలా సినిమాతో సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బ్యూటీ ‘హుమా ఖురేషీ’. ఈ సినిమాలో రజనీ ప్రియురాలిగా నటించిన హుమా, సైరాలో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ ధృవీకరించాల్సి ఉంది. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు.