‘సైరా’ నుండి మరో స్టిల్‌ లీక్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నంబర్‌ 150 తరువాత నటిస్తున్న చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి. ఈ సినిమా ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి లాంగ్‌ గ్యాప్‌ తురువాత నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రానికి కూడా లీకులు బెడద తప్పటం లేదు. గతంలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ నటించిన సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్‌ను ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ తరువాత ఎలాంటి స్టిల్స్‌ లీక్‌ అవ్వకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు చిత్రబృందం.

అయితే తాజా సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. తాజాగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలలో నటీనటులు కనిపించకపోయినప్పటికీ.. ఓ భారీ కోట తగలబడుతున్న స్టిల్స్‌తో పాటు కొందరు బ్రిటీష్‌ సైనికుల దుస్తుల్లో ఉన్న స్టిల్‌ ఇప్పడు సర్య్కూలేట్‌ అవుతుంది.