‘సైరా’ మరింత ఆలస్యం..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నటిస్తున్న 2వ చిత్రం ‘సైరా’. భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్న చారిత్రాత్మక సినిమా సైరా. సైరా నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. దాదాపు రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ వేసిన భారీ సెట్ లో జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబందించిన పోరాట సన్నివేశాల్లో చిత్రికరిస్తున్నారు. ఈ సన్నివేశంలో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో 7 ఎకరాల్లో భారీ సెట్‌ కూడా వేశారు. ఈ నేపధ్యంలో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం ప్రభావం కారణం షూటింగ్ ఆలస్యం అవుతున్నది. అన్ని సిద్ధం చేసుకున్న వెంటనే వర్షం కురుస్తుండటంతో.. షూటింగ్ నిలిపేయాల్సి వస్తుందట. దీంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం ఈ సిన్‌ కోసమే నిర్మాత రామ్ చరణ్ దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.