సో స్వీట్‌ మిస్టర్‌ సి…అంటూ ఉపాసన ట్వీట్‌

ఉపాసన కొణిదల సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆవిడ మిస్టర్‌ సి. మనసున్న మనిషి.. నా కోసం పువ్వులు కొననడానికి వెళ్లారు అన్నారు. రామ్‌చరణ్‌-ఉపాసన టాలీవుడ్‌లో ముచ్చటైన జంటల్లో ఒకరు. చరణ్‌కు సంబంధించిన సినిమా విషయాలు, కార్యక్రమాల గురించి ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. సినిమాల కోసం చరణ్‌ చేస్తున్న కసరత్తుల వీడియోలు, డైట్‌ వివరాలు కూడా పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఓ చక్కటి ఫోటోను పోస్ట్‌ చేశారు. సోమవారం సాయంత్రం చరణ్‌..తన సతీమణి కోసం పువ్వులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

రంగు రంగుల ఆర్కిడ్‌ పూలను కొని వాటిని ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘సో స్వీట్‌. మిస్టర్‌ సి.. నా కోసం పువ్వులు కొనడానికి షాపింగ్‌కి వెళ్లారు. మనసున్న మనిషి ‘ అని ట్వీట్‌ లో పేర్కొన్నారు. ప్రస్తుతం చరణ్..బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో చెర్రీ కొత్త లుక్‌లో కన్పించబోతున్నారట. సినిమాకు ‘రాజవంశస్థుడు’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ అందులో నిజం లేదని బోయపాటి స్పష్టంచేశారు.ఈ సినిమాతో పాటు చరణ్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌లోనూ నటించబోతున్నారు. ఇందులో తారక్‌ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.