స్టార్‌ హీరోయిన్‌కి తప్పని కాస్టింగ్ కౌచ్

స్టార్ నటి అదితిరావ్ హైదరి కూడ కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను అని తెప్పారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనని కూడ కమిట్మెంట్ ఇమ్మన్నారని, కానీ తాను దానికి లొంగకుండా ఎదిరించానని, ఫలితంగా 8 నెలలు అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చిందని అన్నారు ఈ నటి. అలా ఖాళీగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారని, అలాంటి పరిస్థితుల్లో తాను చాలా ధైర్యంగా నిలబడగలిగానని, ఎవరైనా సరే అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎదిరించి పోరాడాలని సలహా ఇచ్చారు.

అవకాశాలు ఎర చూపి కొందరు స్త్రీలను రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏ పరిశ్రమలో చూసినా ఈ కాస్టింగ్ కౌచ్ ఒక పెనుభూతంలా తయారైంది. ఈ కల్చర్ సినీ పరిశ్రమలో కొంత ఎక్కువగానే ఉంది. దీనికి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు బయటికొచ్చి ఎన్నో ఏళ్లుగా తమపై జరుగుతున్న ఈ దారుణాన్ని బయటపెట్టగా ఇప్పుడు స్టార్ నటి అదితిరావ్ హైదరి కూడ దీనిలో ఒకరు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates