స్టైలిష్ స్టార్ పై సెటైర్లు!

‘చెప్పను బ్రదర్’ అంటూ మొదలుపెట్టిన బన్నీ కాంట్రవర్సీ ఇప్పటికీ పలు విషయాల్లో సాగుతూనే ఉంది. కొందరు బన్నీకు టార్గెట్ చేయడంతో ఆయన వ్యవహారశైలిపై నెగెటివ్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ ప్రమోషన్ విషయంలో ఫాలో అవుతున్న కొత్త పోకడల పై సెటైర్లు పడుతున్నాయి. సాధారణంగా ఒక కొత్త సినిమాకు సంబంధించి ముందుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారు. ఆ తర్వాత టీజర్ బయటికి వస్తుంది. కానీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విషయంలో దీనికి భిన్నంగా ముందుగా టీజర్ రెండు నెలల కిందటే నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
‘ఫస్ట్ ఇంపాక్ట్’ పేరుతో టీజర్ ను ముందుగా రిలీజ్ చేశారు. దీంతో ఇక ఫస్ట్ లుక్ ఏం ఉండదని అనుకున్నారు కానీ ఇప్పుడు పోస్టర్ ఇంపాక్ట్ పేరుతో ఫస్ట్ లుక్ ను లాంచ్ చేస్తున్నారు. మార్చి 1న ఈ పోస్టర్ ఇంపాక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో బన్నీ లుక్ పై క్లారిటీ వచ్చేసింది. దీంతో కొత్తగా మళ్ళీ అల్లు అర్జున్ కొత్త లుక్ ఏం చూపిస్తారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.