హత్య అయ్యే ఛాన్సు లేదు.. ఎందుకంటే…!

సినీనటి శ్రీదేవి మరణం పూర్తి స్వాభావికంగాను, గుండెపోటు వంటి హఠాత్పరిణామంతోను జరిగింది కాదనే సంగతి తేటతెల్లం అయింది. వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. హోటల్ గదికి చేరుకున్న తరువాత.. అప్పటికే మద్యం సేవించిన ఆమె బాత్రూంలో స్పృహతప్పి ఉండవచ్చునని అక్కడే బాత్ టబ్ లో పడిపోవడం తో మరణం సంభవించిందని ప్రస్తుతానికి అనుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్త వార్త అయిన శ్రీదేవి మరణాన్ని సహజంగానే.. ఎవ్వరూ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అందుకే దుబాయి పోలీసులు కూడా.. బోనీ కపూర్ ను గంటల కొద్దీ విచారించారనే వార్తలు వస్తున్నాయి. బోనీ కపూర్ ను సుదీర్ఘంగా విచారిస్తున్నారు గనుక.. సహజంగా, అందరిలోనూ ఆయన మీద అనుమానాలు పొడసూపే అవకాశం ఉంది. అయితే బోనీ కపూర్-చేజేతులా శ్రీదేవిని హత్య చేసే అవకాశం ఎంతమాత్రమూ లేదని మరో వాదన కూడా వినిపిస్తోంది. అందుకు వారు చెబుతున్న లాజిక్ ఇలా ఉంది…

బోనీకపూర్ – శ్రీదేవి కుటుంబం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న సంగతి సినీ పరిశ్రమలో చాలా మందికి తెలుసు. బోనీ కపూర్ నిర్మాతగా చేసిన ప్రయోగాలు చాలా విఫలం కావడం ఆయనను తీవ్రమైన నష్టాల్లోకి, అప్పుల్లోకి నెట్టేసింది. చాలా కాలం నుంచి వారికి అప్పుల వాళ్ల నుంచి తిరిగి చెల్లింపు చేయాల్సిందిగా ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు కొన్ని పుకార్లు ఉన్నాయి. అయితే ఆస్తులు అమ్మినా కూడా పూర్తి స్థాయిలో అప్పులు చెల్లవేయలేని పరిస్థితిలో ఉన్న.. బోనీ-శ్రీదేవి కుటుంబం త్వరలోనే తీరుస్తాం అని చెప్పుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు.

కొన్ని సంవత్సరాల కిందట ఒత్తిడి పెరగడంతో… శ్రీదేవి మళ్లీ సినిమాలు చేయబోతున్నారని తీరుస్తాం అని చెప్పుకున్నారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీదేవికి అవకాశాలు అంత ముమ్మరంగా ఏమీ రాలేదు. అందుకు ఆమె భారీ రెమ్యునరేషన్లు చెబుతుండడం కూడా ఒక కారణం అనే వాదన ఉంది. తర్వాత్తర్వాత అప్పుల ఒత్తిడి పెరగడంతో.. జాన్వీ సినిమాలు చేయబోతోంది, తీర్చేస్తాం అని చెబుతూ వచ్చారని పుకారు. శ్రీదేవి కూడా మళ్లీ సినిమాలు చేస్తోంది. ఆమె చేసిన ‘జీరో’ విడుదల కావాల్సి ఉంది.

అప్పుల కోసం ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు.. వారినుంచి అంతో ఇంతో వెసులుబాటు పొందడానికి శ్రీదేవి సినిమాలు చేస్తుందనే కారణమే కాపాడుతున్నప్పుడు.. ఆమెను బోనీకపూర్ స్వయంగా ఎందుకు దూరం చేసుకుంటాడు.. అనేది పలువురిలో వినిపిస్తున్న వాదన. ఇది ప్రమాదమే అయి ఉండవచ్చునని, హత్య కాకపోవచ్చునని అనుకుంటున్నారు. నిజానిజాలు ఎప్పటికి బయటపడతాయో మరి!