హీరోయిన్లపై మంత్రి ఘాటు విమర్శలు!

సినిమా హీరోయిన్లను ఉద్దేశించి కేరళ ఎంపీ, అమ్మ చీఫ్, నటుడైన వరీద్ థెక్కెదల ఘాటు విమర్శలు 
చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన మంత్రి హీరోయిన్ల చెడు ప్రవర్తన గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. బాధ్యతగల పదవిలో ఉండి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు నిరసన వ్యక్తం చేశారు. కేరళ ఎంపీ అయిన వరీద్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే మలయాళ తారల కిడ్నాప్, లైంగిక దాడుల అంశాలపై మీడియా వరీద్ ను ప్రశ్నించింది. గతంలో ఆయన మలయాళ నటి కిడ్నాప్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చిన నేపధ్యంలో రాజీనామా చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాను రాజీనామా చేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. 
అలానే కాస్టింగ్ కౌచ్ గురించి ఎదురైన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ.. మలయాళ ఇండస్ట్రీలో అలాంటి వ్యవహారాలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినీ తారలపై లైంగిక వేధింపులు లేవు. అవన్నీ ఎప్పుడో పోయాయి. అన్యాయాలను బహిరంగంగా బయటపెట్టే రోజులు వచ్చాయి. చిత్రపరిశ్రమలో చెడు ప్రవర్తనతో ఉన్న కొందరు తారలతో మాత్రమే సమస్యలు వస్తున్నాయి. అవకాశాల కోసం కొందరు కథానాయికలు దిగజారుడు పనులు చేస్తున్నారు. అలాంటి వారే కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని మంత్రి వరీద్ పేర్కొన్నారు. 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here