హీరోలతో గొడవ పడుతున్న సాయి పల్లవి?

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఈ చిత్రంలో శర్వానంద్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో సాయి పల్లవి, శర్వానంద్‌ కి మద్య గొడవ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌ సమయంలో సాయి పల్లవి బాగానే ఉన్నప్పటికీ షాట్‌ ముగిసిన అనంతరం తనకేమీ పట్టనట్లు ఓ బుక్‌ తీసుకొని దూరంగా వెళ్లి ఒంటరిగా కూర్చుంటూ.. ఎవరు పిలిచినా రాకుండా, షాట్‌ కి షాట్‌ కి మద్య ఇబ్బంది పడేలా చేసిందట దాంతో శర్వానంద్‌ కోపంతో ముఖం మీదే అడిగాడట. కానీ ఆమె మాత్రం ఎక్కడా తగ్గకుండా అలానే సమాధానం ఇస్తోందట.

సాయి పల్లవి బిహేవియర్‌ తో గతంలో నాగశౌర్య, నానిలు కూడా ఇబ్బంది పడ్డారు. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ‘కణం’ అనే చిత్రంలో నటించారు. కాగా ఆ సినిమా షూటింగ్‌లో కూడా సాయి పల్లవి నాగశౌర్యని ఇబ్బంది పెట్టిందని, దాంతో నాగశౌర్య అవమానంగా ఫీలయ్యాడని కథనాలు వచ్చాయి. అలాగే నాగశౌర్య కూడా సాయి పల్లవి గురించి ఓపెన్‌ గానే మాట్లాడాడు తనకు ఇగో ఎక్కువ అని అన్నాడు. ఇక నానితో ‘ఎంసిఏ’ చిత్రంలో నటించింది. ఆ సినిమా షూటింగ్‌లో కూడా నానితో సాయి పల్లవి గొడవ పడిందని కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు శర్వానంద్‌తో కూడా గొడవ అయ్యిందట! ఈ ముగ్గురు హీరోలతో గొడవ పడి వార్తల్లో నిలిచి పోయింది సాయి పల్లవి.