హ్యాపీ బర్త్‌డే.. అభయ్‌

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ కుమారుడు అభయ్‌ రామ్‌ ఈ రోజు(ఆదివారం) తన 4వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈసందర్భంగా గారా కొడుకుకి తారక్‌ సోషల్‌ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా అభయ్‌ను ఆశీర్వదించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైం కి (అన్ని విషయాల్లో తోడుగా ఉండే వ్యక్తి) జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరి విషెస్‌కు కృతజ్ఞతలు’ అంటూ.. తండ్రి ప్రేమ కుర్రాడు నాలగో సంవత్సరంలోకి అడుగుపెట్టాడు’ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఎన్టీఆర్‌ జత చేశారు. దీంతో పాటు అభియ్‌ తో కలిసి దిగిన సెల్పీని పంచుకున్నారు.

అయితే ఈ సందర్భంగా అభయ్‌రామ్‌కు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కూడా సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘జన్మదిన శుభాకాంక్షలు డార్లింగ్‌ అభయ్‌రామ్‌’ అంటూ చరణ్‌ మీడియోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ విడియోలో ‘హాయ్‌ అభయ్‌.. వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. నీకు మంచి గిఫ్ట్‌ పంపించాను. నాన్న దగ్గర ఉంది తీసుకో. నీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. లవ్‌ యూ’ అని చెప్పారు. తన కుమారుడిని విష్ చేసినందుకు తారక్‌.. చరణ్‌, ఉపాసనలకు ధన్యావాదాలు చెప్పారు. బహుమతి అభయ్‌కు చాలా నచ్చింది అన్నారు.