‘హ్యాపీ వెడ్డింగ్‌’ టీజర్

‘హ్యాపీ వెడ్డింగ్‌’ సుమంత్ అశ్విన్‌, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం. లక్షణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాని నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా..ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

ఈ టీజర్‌లో వధూవరుల తండ్రులు ఫోన్లో మాట్లాడుకుంటూ. .’ఆకూ వక్కా మార్చుకునే టైం వచ్చేసిందండీ. మూహూర్తం మీరు పెట్టిస్తారా? మమ్మల్ని పెట్టించమంటారా?’ అన్న డైలాగులతో మొదలైంది. పెళ్లిబాజాలు మోగుతున్నట్లుగా వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. సుమంత్‌, నిహారిక తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కుర్రకారుని ఆకట్టుకుంటాయని ఇదివరకు చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పెళ్ళి కుదిరిన రోజు నుంచి పెళ్ళి జ‌రిగే రోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంది? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్‌ 30న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు..