100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన విజయ్‌ దేవరకొండ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కేవలం మూడు వరుస హిట్లతో స్టార్ హీరో జాబితాలోకి వెళ్ళిపోయాడు . ‘పెళ్లి చూపులు’తో పరిచయమై ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న విజయ్‌ ‘గీత గోవిందం’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ 2 వెల్లడించిన లెక్కల ప్రకారం నైజాంలో 15.45 కోట్లు, సీడెడ్లో 5.10 కోట్లు, నెల్లూరులో 1.09 కోట్లు, గుంటూరులో 3.5 కోట్లు, కృష్ణాలో 2.98 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.95 కోట్లు, వైజాగ్లో 4.72 కోట్లు, బెంగుళూరు 3.84 కోట్లు,చెన్నైలో 1.72 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.29 కోట్లు షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates