130 ప్రాజెక్టుల పూర్తితో ఎంఈఐఎల్ రికార్డ్

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్యూనిట‌్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

గత ఏడాదిలో ఆరు నెలల రికార్డు సమయంలో రాజస్థాన్ లోని రాగేశ్వరి వద్ద 80 ఎంఎంఎస్‌సీఎఫ్ఈడీ సామర్థ్యం గల గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ (RGT)ను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్.కైయిర్న్ ఇండియా లిమిటెడ్ కోసం నుంచి ఈ ప్రాజెక్టును ఆగష్టు 2018 న స్వీకరించి, 2019 మార్చి నాటికి పనులను పూర్తిచేసింది. ప్రధానంగా సేకరణ, ఇంజనీరింగ్, నిర్వహణ పనులను ఏకకాలంలో చేపట్టడం వల్ల ఇది సాధ్యమయ్యింది. ఈ గ్యాస్ ప్రాసెసింగ్ టెర్మినల‌్ నిర్వహణ భాద్యతలను కూడా 18 నెలల పాటుఎంఈఐఎల్ చేపట్టింది. ఎంఈఐఎల్‌ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.

గుజరాత్ లోని సౌరాష్ట్ర కాలువపై రెండు జల విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఎంఈఐఎల్గతేడాది పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమయ్యింది. 15 మెగావాట్ల సామర్థ్యం కలిగి మూడు యూనిట్లనుఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తుండగా, ఇందులో మూడో యూనిట్ పనులు పూర్తి చేసుకొని, ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.

కర్ణాటకలోని వైటీపీఎస్ థర్మల్ ప్లాంటుకు నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వైటీపీఎస్ ప్రాజెక్టు. ఇందులో భాగంగా ఎంఈఐఎల్ జాక్ వెల్, పంప్ హౌజ్, పైప్ లైన్ లను ఏర్పాటు చేసింది. నీటిని వైటీపీఎస్ ప్లాంటుకు తరలించడం, ఉపయోగించిన నీటిని తిరిగి వైటీపీఎస్ ప్లాంటుకు పంపింగ్ చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

నెల్లూరు నగరం, పరిసర గ్రామాల కోసం తాగునీటి పథకాన్ని ఎంఈఐఎల్ నిర్మించింది. దాదాపు 70,000 కుటుంబాలకు ఈ ప్రాజెక్టుతో శుద్ధి నీటిని అందించనున్నారు. పొదలకూరు మండలంలోని విరువూరు వద్ద పెన్నా నదిపై ఇన్ టెక్ వెల్ ను 3 వర్టికల్ పంపు సెట్ల తో 544 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసింది. మహమదాపూర్ లో నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి రోజుకు 122 మిలియన్ లీటర్ల నీటిని నెల్లూరు ప్రజలకు అందించనున్నారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 8లో రామడుగు 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సబ్ స్టేషన్ ద్వారా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ లోని 7 పంపు మోటార్లకు నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తుంది. ఈ పంపు మోటార్ ఒక్కో మోటార్ సామర్థ్యం 139 మెగావాట్లు. ఇవి ప్రపంచంలోని అతి పెద్ధవి.
400/220 కేవీసుందిళ్ల సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా సుందిళ్ల పంప్ హౌస్ లోని 9 పంపు మోటార్లకు విద్యుత్ అందించడంతో పాటు అన్నారం, మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందిస్తుంది. అలాగే 220కేవీ అన్నారం సబ్ స్టేషన్ నుంచి అన్నారం పంప్ హౌస్ లోని 8 యూనిట్లకు, 22 కేవీమేడిగడ్డ సబ్ స్టేషన్ మేడిగడ్డ పంప్ హౌస్ లోని 11 మోటార్లకు విద్యుత్‌ను అందిస్తుంది.
నర్సాపూర్ లీలో లైన్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి-సత్తెనపల్లి సబ్ స్టేషన్లు క్లయింట్ కు ఎంఈఐఎల్ గడువుకు ముందే అప్పగించడం జరిగింది.

CLICK HERE!! For the aha Latest Updates