16న కల్యాణ్ రామ్, తమన్నా చిత్రం ”నానువ్వే” ట్రైలర్

కల్యాణ్ రామ్, తమన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”నా నువ్వే”. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని
పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తమిళ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిరణ్
ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మాతలు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా యూత్ ని
విశేషంగా ఆకట్టుకోవచ్చు.

ఈ సినిమాలో తమన్నా రేడియో జాకీగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 25న ప్రేక్షకుల ముందుకు
రానున్న ఈ చిత్రానికి 16న సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు శరత్ అందించిన ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎంఎల్ఏ సినిమా తర్వాత ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.