16, 36, 96 ప్రేమలో ‘త్రిష’

దాపు 15 ఏళ్ల పాటు కథానాయికగా హవా నడిపించిన చెన్నై చిన్నది త్రిష. తాజాగా తమిళంలో విజయ్ సేతుపతి సరసన
హీరోయిన్‌గా నటిస్తోంది. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్‌ మూవీగా తెరకెక్కుతున్నఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌
జరుపుకుంటోంది. 16, 36, 96 ఏళ్లలోని ప్రేమను చాటిచెప్పే కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా నటిస్తున్నారు.

విజయ్‌ సేతుపతి ఈ చిత్రం గురించి చెబుతూ చాలా భిన్నమైన చిత్రమిది. వైవిధ్యాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక
నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రంలో త్రిషా నటన అద్భుతంగా ఉంటుందని, ఆమెకు నటనపై అంకిత భావం ఎక్కువని.. సరైన
సమయానికి ఆమె షూటింగ్ స్పాట్‌కు వచ్చేస్తారని అన్నారు. తన పాత్ర, డైలాగ్స్ వివరాలు తెలుసుకుని అందులో లీనమైపోతారని అన్నారు. దర్శకుడు సైతం ఆశించని స్థాయిలో నటించి మెప్పిస్తారని అన్నారు. ఈ చిత్రానికి గోవింద మీనన్ సంగీతం అందిస్తున్నారు. నందగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.